‘వారి’పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి  

ప్రజాశక్తి-విఆర్.పురం : కుటూరు గ్రామంలో నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్సీ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిని గ్రామస్తులు జీవో నెంబర్ త్రీ గురించి, పోలవరం విషయంలో గతంలో ఎన్నికల వాగ్దానం లక్ష 15 వేలు ఇచ్చిన భూములకు ఐదు లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ఆర్ అండ్ 6 లక్షల 85 వేల రూపాయలు ఇచ్చిన వాటికి 10లక్షలు రూపాయలు చేస్తామని చెప్పారు.  రెండుసార్లు వరదలకు ఇండ్లకు నష్టపరిహారం ఇస్తానని, ప్రచారం చేశారు. వాగ్దానాలు ఇచ్చారు కదా అవేవీ మాకు నెరవేరలేదని ప్రశ్నిస్తే అందుకు అమాయక ఆదివాసులపై దాడి చేయడం అమానుషం సంఘటనని అంతేకాకుండా అక్కడున్న పోలీసులు తుపాకులు పెట్టి కాల్చి చంపుతామని ఆదివాసి గిరిజనులు బెదిరింపుకు దిగడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీలపై దాడి చేసినటువంటి ఎమ్మెల్సీ అనంత బాబుపై ఆవుల మర్యాదస్సుపై అక్కడున్న పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో రాజు, వినోద్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కండిషన్ బెల్ పై ఉన్న వ్యక్తికి అర్ధరాత్రి సమయంలో ప్రచారం చేయడానికి ఏ విధంగా పోలీసులు సహకరిస్తున్నారని పోలీసులు కూడా అతుక్సాహం ప్రదర్శించి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేశారని ఈ విషయాలపై తక్షణమేవిచారణ జరిపించి వారిపై కేసు నమోదు చేయాలని, లేనియెడల ఎన్నికల కమిషనర్ కు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రతి గ్రామంలో అనంతబాబుపై తిరుగుబాటు తప్పదని వారు చేసింది ఏమీ లేదని ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక వారిపై దాడులు దిగితే సహించేది లేదని వి.ఆర్.పురం మండలం సిపిఎం పార్టీ కమిటీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, జిల్లా కమిటీ సభ్యులు పూణెం సత్యనారాయణ హెచ్చరిస్తోంది.

➡️