మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ

ప్రజాశక్తి-పెదబయలు : మృతుని కుటుంబాన్ని పరామర్శించిన అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు సీతాగుంట పంచాయతీ కుమ్మరి పుట్టు గ్రామస్తుడు గూబరి గణేష్ 35 ఒంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు సిపిఎం, గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కిల్లో సురేంద్ర, మండల సిపిఎం కార్యదర్శి బోండా సన్నిబాబు కుమ్మరి పుట్టు గ్రామంలో సందర్శించి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఘనమైన నివాళులు అర్పించారు. మృతిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ప్రజాశక్తితో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సిపిఎం బలపరచిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించలని అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటికే నియోజకవర్గం స్థాయిలో విస్తృతంగా ప్రచారంతో ప్రజల దగ్గర దూసుకుపోతున్నట్లు తెలిపారు. ఆదివాసీ ప్రజలు మేలుకోవాలని జిఓ మూడు నంబర్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే రద్దు చేసారని, ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు  సుప్రీం కోర్టు రద్దు చేసిందన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సిపిఎం, గిరిజన సంఘం ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించిందని రాష్ట్ర ప్రభుత్వం కనీసం రివ్యూ పిటిషన్ దాఖలు పరచలేదన్నారు. తెలుగుదేశం, వైస్సార్సీపీ రెండు దొంగ పార్టీలేనని అన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుఫు డా మీడియం బాబురావు హయాంలో అటవీహక్కుల చట్టాన్ని తెస్తే బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. టిడిపి, వైస్సార్సీపీ పార్టీలను నమ్మవద్దని ప్రజల కోసం నిత్యం అండగా ఉండే సిపిఎం పార్టీని నమ్ముకొని ఓటు వేస్తే ఆదివాసీ గిరిజనుల బ్రతులు బాగుపడతాయాన్నారు. టిడిపి అభ్యర్థి, వైస్సార్సీపీ అభ్యర్ధులు ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలపై నోరు విప్పలేదని, పోరాటాలు చేయలేదని అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ క్షంలో జైలుకు వెళ్లి కోట్లరూపాయలు దోచుకొన్న సొమ్ము లాయర్లను ధర పోసాడని, వైస్సార్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనంతో చంద్రబాబుని జైలు నుండి బయటకు రాకుండా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసాడని గుర్తుచేశారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారని, దోపిడీ చేస్తున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తాము అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలకు అండగా సిపిఎం పార్టీ మాత్రమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో సిపిఎం బలపరచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ ప్రసిడెంట్ బోండా గంగాధరం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️