సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

ప్రజాశక్తి-వి ఆర్ పురం : ఏజెన్సీ సమగ్రాభివృద్ధి సాధించాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను, ఎమ్మెల్యే ఎంపీ గెలిపించాలని జిల్లా సభ్యులు పూనం. సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు అన్నారు. చిన్నమటపల్లి కన్నాయిగూడెం గ్రామంలోని ముఖ్య నాయకుల గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, దానితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని ఓడించాలని, లౌకిక శక్తులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మండలంలో పోలవరం పై రోడ్లు, మంచినీరు కొండపోడు పట్టాలు ఉపాధి హామీ పనుల వంటి మౌలిక సదుపాయాల కోసం సిపిఎం పోరాడిందని గుర్తు చేశారు. సిపిఎం అభివృద్ధి ఎమ్మెల్యే ఎంపీ గెలిపించాలని చట్టసభలో వారు ఉంటే మనం ఎన్ని సాధించగలుగుతామని వారు అన్నారు.

➡️