రంగా హత్య తరహాలోనే జగన్‌ పై దాడి

Apr 15,2024 00:32
మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-చింతపల్లి: హింసా రాజకీయాలకు చంద్రబాబు నాయుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని వైసిపి జిల్లా అధ్యక్షులు, పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై రాళ్ల దాడిని ఖండించారు. స్థానిక విలేకరులతో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కాపు ఉద్యమనేత వంగవీటి రంగాను ఏ మాదిరిగా చంద్రబాబునాయుడు హత్య చేయించారో ఆ తరహాలోనే జగన్మోహన్‌ రెడ్డిపై దాడి జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉండడం దురదృష్టకరమన్నారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై దాడి జరగడం బాధాకరమన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఈ తరహా దాడులకు దిగుతున్నాయన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడిపై ఎన్నికల కమిషన్‌ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీకాంత్‌ రాజు, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్‌, ఎంపీపీ అనూష దేవి, సర్పంచ్‌ దురియ పుష్పలత, మండల ప్రెసిడెంట్‌ రవి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ షేక్‌ మీరా, మండల కోఆప్షన్‌ మెంబర్‌ నాజర్‌ వలి, వైస్‌ ఎంపీపీ వెంగళరావు శారద, లలిత పాల్గొన్నారు.

➡️