పర్వతప్రాంత గ్రామాన్ని సందర్శించిన పోలీసులు

The police visited the mountain village

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని లోదొడ్డి పంచాయతీ పర్వత ప్రాంతమైన కిండంగి గ్రామాన్ని రాజవొమ్మంగి సీఐ ఎన్ సన్యాసి నాయుడు, జడ్డంగి ఎస్ఐ రఘునాధరావు సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో ముచ్చటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, గిరిజనుల స్థితిగతులు గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజవొమ్మంగి సీఐ ఎన్ సన్యాసినాయుడు మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూసించారు. గంజాయి, నాటుసారా అక్రమ రవాణా, చేయకూడదని, విక్రయించకూడదని తెలిపారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండరాదని, ఎవరి వద్దైన నాటు తుపాకులు ఉంటే పోలీస్ స్టేషన్ లో స్వచ్చందంగా అప్పగించాలని సూసించారు. గ్రామ యువత, గ్రామస్తులు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామంలోని చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపణి చేసారు, ఈ సందర్భంగా గిరిజనులు పోలీసులు దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా, సరైన రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు, తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️