మేడే రచనల పోటీ – 2024 ఫలితాలు

మేడే సందర్భంగా విజయవాడలోని జాషువా సాంస్క ృతిక వేదిక నిర్వహించిన రచనల పోటీ ఫలితాలను ప్రకటించారు. కథలు, కవితలు, పాటల విభాగాల్లో ప్రకటించిన విధంగా బహుమతులు అందజేస్తున్నామని నిర్వాహకులు గుండు నారాయణరావు తెలిపారు. చాలా తక్కువ రచనలు వచ్చినందున వ్యాసాల విభాగంలో పోటీని రద్దు చేస్తున్నామని తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ సభ జూన్‌ నెలలో విజయవాడలో జరుగుతుందని, విజేతలు స్వయంగా హాజరై, బహుమతులు స్వీకరించాలని కోరారు. ‘బహుమతి పొందిన రచనలతో పాటు మరికొన్ని రచనలను ఎంపిక చేసి, కథా, కవితా సంకలనాలు వెలువరిస్తాము. ఆ పుస్తకాల ఆవిష్కరణ బహుమతుల ప్రదాన సభలో ఉంటుంది.’ అని వివరించారు. విజేతల వివరాలు ఇవీ …

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కథలకు వేంపల్లి షరీఫ్‌, కె. ఉషారాణి, వొరప్రసాద్‌; కవితలకు అరసవిల్లి కృష్ణ, అనిల్‌ డానీ, శాంతిశ్రీ; పాటలకు జగన్‌, నారాయణ వ్యవహరించారు. ఈ పోటీల్లో పాల్గొన్న కవులకు, రచయితలకు, వ్యాసకర్తలకు, తమ సమయాన్ని వెచ్చించి రచనల ఎంపిక జరిపిన న్యాయనిర్ణేతలకు జాషువా సాంస్క ృతిక వేదిక ధన్యవాదాలు తెలియజేసింది.

➡️