భగత్ సింగ్ కి నివాళులు

Mar 23,2024 13:26 #anakapalle district

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గీతాకృష్ణ మాట్లాడుతూ భగత్ సింగ్ అతితక్కువ వయసులోనే పోరాటాలకు బలయ్యారని విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. హక్కులు కాపాడుకోవాలంటే భగత్ సింగ్ ను చూసి పోరాటాలు నేర్చుకోవాలని , అలాంటి స్వాతంత్ర సమరయోధుల వలనే మనం స్వాతంత్రం పొందామని స్వేచ్ఛ కలిగి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ సభ్యులు జ్ఞానేశ్, ,వరహాలు, రవి, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

➡️