క్షయ వ్యాధి దినోత్సవ ర్యాలీ

ప్రజాశక్తి-రంపచోడవరం : ఏజెన్సీలోని క్షయ వ్యాధి పూర్తిస్థాయిలో నిర్మూలించే బాధ్యత మన అందరిపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గానోరే పేర్కొన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయము నుండి క్షయ వ్యాధి నిర్మూలనకు సంబంధించిన ర్యాలీని ప్రాజెక్ట్ అధికారి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గానోర్ మాట్లాడుతూ ఏజెన్సీలోని క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా ఏజెన్సీలోని ఎవరికైనా క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రులకు వచ్చి టెస్టులు చేయించుకుని మందులు వాడిన యెడల క్షయ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు అని ఆయన తెలిపారు. 2025వ సంవత్సరానికి ప్రపంచంలోనే క్షయవ్యాధి పూర్తిస్థాయిలో నిర్మూలించే విధంగా అందరం కలిసి ముందుకు సాగాలని ఆయన అన్నారు.భారతదేశపు ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం 2.6 లక్షల మంది క్షయవ్యాధితొ బాధపడుతున్నారని అదేవిధంగా సుమారు 4 వేల మంది ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో చనిపోవుతున్నారని ఆయన తెలిపారు. ఎవరైనా క్షయ వ్యాధితొ బాధపడుతున్న వారిని గుర్తించి ఆసుపత్రికి వెళ్లి క్షయవ్యాధి టెస్టులు చేయించుకోమని అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలపై తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు.అనంతరం ఐటీడీఏ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు క్షయ వ్యాధి నిర్మూలన నినాదాలతో వెళ్లి అంబేద్కర్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి చేయవ్యాధి నిర్మూలలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎ డి యం &హెచ్ ఓ డాక్టర్ జి.ప్రకాశం,ఏరియా ఆసుపత్రి సూపర్ ఇండెంట్ డాక్టర్ లక్ష్మి, డాక్టర్ వెంకట ఇందిరా,వైద్యాధికారులు రాధిక, అపూర్వ,వినోద్,సుజిత,సాహిన్,ఎ యన్ యం లు ఆశ వర్కర్లు,డిగ్రీ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️