అరకులోయలో గాలి వాన

Apr 13,2024 23:39
కురుస్తున్నవర్షం

ప్రజాశక్తి- అరకులోయ: పర్యాటక కేంద్రమైన అరకులోయలో శనివారం మధ్యాహ్నం గాలి వాన కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన స్థానికులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. మండుటెండలతో బాధ పడుతున్న స్థానికులు, పర్యాటకులు శనివారం మధ్యాహ్నం వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి పంట రైతులకు ఈ వర్షం ఎంతగానో ఉపకరిస్తుందని స్థానికులు తెలిపారు. సుమారు గంట పాటు వర్షం కురవడంతో స్థానికులు, రైతులు, పర్యాటకులు ఆశ్వాదించారు.

➡️