గడప గడపకు సంక్షేమ పథకాలు

Jan 25,2024 00:24
లబ్ధిదారులతో మాట్లాడుతున్న బూడి

డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడుప్రజాశక్తి -మాడుగుల: ప్రజలందరికీ ఉపకారం చేసేందుకు సీఎం జగన్‌ పలు పథకాలు ప్రవేశ పెడుతున్నారని డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎం.కోటపాడు, వల్లపురం గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గడపకు అవసరమైన సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. కోటపాడు, కె.ఎం.వల్లాపురం గ్రామలలో అయన పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సాంకేతిక కారణాల రీత్యా అగిన పథకాలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు.పుట్టుకతో అనారోగ్య సమస్య తో ఉన్న బాలుడిని పరామర్శించి అర్ధిక సహకారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కీముడు రమణమ్మ, మాజీ ఎంపీపీ రామ ధర్మజా, మండల పార్టీ అధ్యక్షులు రాజారాం, మాడుగుల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సేనాపతి కొండలరావు, గ్రామ సర్పంచ్‌ కరణం రాము పాల్గొన్నారు.నేడు, రేపు గడప గడపకు మన ప్రభుత్వంచీడికాడ: మండల కేంద్రంలో ఈనెల 25,26 తేదీల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్సిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు పరవాడ మహేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు హాజరు కానున్నారని పేర్కొన్నారు. మండలంలోని ఎంపీటీసీలు, జడ్పిటిసి, సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

➡️