భోగి మంటల్లో జిపిఎస్‌ ప్రతులు

యుటిఎఫ్‌ నాయకుల

ప్రజాశక్తి – నర్సీపట్నం టౌన్‌: నర్సీపట్నం డివిజన్‌ యుటిఎఫ్‌ నాయకుల ఆదివారం పట్టణంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో జిఒ ప్రతులను దగ్ధం చేశారు. విశాఖ జిల్లా యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు మాట్లాడుతూ,బకాయిలు అడిగినందుకు తిరిగి ఉద్యోగ ఉపాధ్యాయుల పైనే అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు.జిల్లా కార్యదర్శి కళింగ సతీష్‌ మాట్లాడుతూ, బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు యుటిఎఫ్‌ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సహా అధ్యక్షులు పి.గాయత్రి, ఉపాధ్యాయ నాయకులు గడ్డి నాయుడు, చిట్టియ్య, జల్లూరు ప్రసాద్‌, లోవరాజు, సాంబమూర్తి, గంట్యాడ అప్పలరాజు పాల్గొన్నారు.అచ్యుతాపురం:ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా జిపిఎస్‌ మోసపూరిత పింఛన్‌ విధానాన్ని తీసుకు వచ్చిన జీవో ప్రతులను ఆదివారం మడుతురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌ భాగస్వామ్య పింఛన్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.త్రినాధ స్వామి భోగి మంటలలో వేశారు. రాష్ట్రంలో 15 లక్షల పైగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఉన్నారని చెప్పారు. సిపిఐ ఆధ్వర్యాన ఆందోళన కే.కోటపాడు: మండలం మర్రివలస గ్రామంలో జీవో 27 రద్దు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల సిపిఐ నాయకులు జీవో కాపీలను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేచలపు కాసుబాబు, మండల సిపిఐ కార్యదర్శి గొర్లే దేవుడు బాబులు మాట్లాడుతూ, భూ సర్వే కూడా సమగ్రంగా జరగకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా రెవెన్యూ అధికారులతోనే వస్తున్నాయన్నారు.జీవో 27ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి అప్పలనాయుడు, ఇల్లాకు రాము, పొంతపల్లి రామారావు, పాల్గొన్నారు.

➡️