ప్రేమంటే ఇదేనేమో?

Jan 7,2024 12:43 #anakapalle district
mother love
  •  ప్రమాదంలో మరణించిన కుక్కపిల్ల
    రోజంతా కాపుకాసిన తల్లి

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : ప్రేమనేది మనుషులకే కాదు జంతువులకి ఉంటాయన్నది తెలిసిందే. బంధువులో కుటుంబీకులు దూరమైతేనే ఎంతో బాధ పడుతుంటారు. ప్రేమకు అభిమానానికి విశ్వాసమైన కుక్క తన పిల్ల మరణిస్తే రోజంతా అక్కడే ఉండి విలపిస్తూ ప్రయాణికులను కన్నీరు పెట్టించింది. కసింకోట-బంగారు మెట్ట రోడ్లో దిబిడి గ్రామం వద్ద ఆదివారం రోడ్డు దాటుతుండగా ఒక కుక్క పిల్ల ను కారు ఢీకొనడంతో అక్కడకక్కడే చనిపోయింది. దూరంగా ఉన్న తల్లి కుక్క పరుగు పరుగున వచ్చి చనిపోయిన కుక్క పిల్ల వద్ద తిరుగుతూ దాన్ని లేపే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆ కుక్క పిల్ల చనిపోయింది. దాని చుట్టూ తిరుగుతూ ఉదయం ఎనిమిది గంటల నుండి అక్కడే ఉండిపోయింది. అరుస్తూ విలపిస్తూ వుంది. ఏవైనా వాహనాలు మరణించిన కుక్క పిల్ల వైపు వస్తే ఆ వాహనాల వైపు పరుగులు తీస్తూ తన ప్రేమను చూపించుకుంది. మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రేమ ఉంటుందన్నది నిదర్శనం. దాని పక్కనే ఒక్కొక్కసారి పడుకుంటూ వినిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు వాహనదారులు కళ్ళు చెమర్చు కుంటూ వెళ్లారు.

➡️