అల్లూరికి ఘన నివాళి

May 8,2024 00:33
కెడిపేటలో నివాళి అర్పిస్తున్న సంఘం సభ్యులు

ప్రజాశక్తి-యంత్రాంగం విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 100వ వర్థంతిని అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనకాపల్లిడెస్క్‌:నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజులు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించారన్నారు. ఆ వీరుడు మరణించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగరాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలోని అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ, గిరిజనులకు అండగా నిలిచి ఉద్యమ పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రజా సంఘ నాయకులు జీ.గురుబాబు, ఎల్‌.వి.రమణ, డిసిహెచ్‌.క్రాంతి, శివలంక కొండలరావు, చౌదరి తదితరులు పాల్గొన్నారు.అల్లూరి స్మారకాల అభివృద్ధికి కృషి చేస్తానని అనకాపల్లి ఎన్డీఏ ఎంపి అభ్యర్ధి సీఎం రమేష్‌ అన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడుతో కలిసి కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్కును సందర్శించి అల్లూరి, గంటందొర సమాధులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప, నర్సీపట్నం బిజెపి ఇన్‌చార్జ్‌ ఎర్రంనాయుడు పాల్గొన్నారు. గొలుగొండ:క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు సమాధుóల వద్ద క్షత్రియ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.వెంకటపతి రాజు, సౌత్‌ ఇండియా డైరెక్టర్‌ లక్ష్మీ నరసింహరాజులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి పార్కులో క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో గతంలో 16 లక్షల ఖర్చు చేసి భారీ అల్లూరు విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. పార్కు అభివృద్ధికి క్షత్రియ పరిషత్‌ సభ్యుల ఆర్థిక సహకారంతో మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గంటం దొర మనవడు బోడిదొర కూతురుకి దారమల్లేశ్వరకి క్షత్రియ పరిషత్తు నుండి 25వేల రూపాయలు, అదేవిధంగా పార్కులో పనిచేస్తున్న ముగ్గురు సంరక్షకులకు 2000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శివాజీ రాజు, నర్సీపట్నం క్షత్రియ పరిషత్‌ కార్యదర్శి చక్రపాణి రాజు, సభ్యులు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.రాంబిల్లి :మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతి సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), ప్రజా సంఘాల నాయకులు మంగళవారం మండల కేంద్రంలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.నారాయణరావు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్‌ తెల్లదొరల దోపిడీని వ్యతిరేకిస్తూ, ఆదివాసీ గిరిజనులలో చైతన్యం నింపి గొప్ప పోరాటాలు నడిపిన మహాయోధుడు అల్లూరి అని పేర్కొన్నారు. దేశంలో తెల్లదొరలు పోయినా నేటికీ దోపడి అంతం కాలేదని, మన దేశ పాలకులే దేశ సంపదలు కొద్దిమంది వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినా నేటికీ ఉపాధి లేక యువతీయువకులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి బాటలో యువతీ యువకులు ఉపాధి కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు వై.రాము, అల్లూరి ప్రజాసంఘాల అభివృద్ధి వేదిక అధ్యక్షులు భూపతి అప్పారావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.మునగపాక : మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో టిడిపి నాయకులు మంగళవారం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగపా పార్టీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకులపై తిరుగు బావుట ఎగరేసిన మన్యం పులి అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆడారి మంజు, భీమరశెట్టి శ్రీనివాసరావు, దాడి ముసలి నాయుడు, మొల్లేటి సత్యనారాయణ, సూరిశెట్టి రాము, ఆడారి నాగ సత్యనారాయణ, బివి రమణ, భాస్కర్‌, రామచంద్రరావు, పరమేష్‌, అప్పారావు పాల్గొన్నారు. పద్మనాభం : పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ మంత్రి ఆర్‌ఎస్‌డిపి అప్పలనరసింహరాజు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పాండ్రంగి గ్రామంలోని అల్లూరి పార్క్‌ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌డిపి అప్పలనరసింహరాజు మాట్లాడుతూ, అల్లూరి జీవిత చరిత్ర వివరించారు. ఈ కార్యక్రమంలో మహంతి అప్పలరమణ, పి.వెంకటరావు, బి.సంతోష్‌, కె.రమణ, పిన్నింటి శేఖర్‌, బూర్లే సత్యం, బర్నాల శ్రీను, పి.రామకృష్ణ, భోజరాజు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సీతమ్మధార : సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, ఉత్తర నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చొక్కాకుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు లక్కరాజు రామారావు (ఉత్తరం), గుత్తుల శ్రీను (పశ్చిమం), భగత్‌ పిరిడి (పెందుర్తి), డిసిసి అధ్యక్షులు వజ్జాపర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్‌, పరదేశి సతీష్‌, శేషం శ్రీనివాస్‌, శివకుమార్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మధురవాడ : జివిఎంసి 7వ వార్డు పరిధి స్వత్రంత్ర నగర్‌ కాలనీలో ఉన్న అల్లూరి విగ్రహానికి పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగోతి సూర్యప్రకాశరావు పూలమాలవేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జగన్మోహన్‌ చౌదరి, పాద వెంకటరమణ, పోలిశెట్టి నాగేశ్వరరావు, పాపారావు, డాక్టర్‌ నాగ భూషణ్‌ నాయుడు పాల్గొన్నారు.

➡️