‘అనంత’లో నృత్య రూపం ఇలా…

'అనంత'లో నృత్య రూపం ఇలా...

ప్రభుత్వ వైఫల్యాలను కళారూపం ద్వారా నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌

”పబ్లిక్‌ కొళాయిలు, గహకనెక్షన్లలో తాగునీరు రావడంలేదని ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటారు. ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ సలహాదారు మంత్రికి ఆదేశాలు జారీ చేస్తారు. ఈయన ఆదేశాలు ఇవ్వడమే కానీ నిధులు మంజూరు చేయరు. నిధులు లేకుండానే పనులు మాత్రం సాఫీగా జరిగిపోవాలని హుకుం జారీ చేస్తుంటారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కుళాయిల్లో నీరు రాకపోవటానికి కారణం అన్వేషించాలని, ఇందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తారు. ఈ కమిటీ ఏం పని చేస్తుందో ఎవరికీ తెలియదు. కిందస్థాయిలో మాత్రం నీటి సమస్యకు పరిష్కారం దొరకదు. క్షేత్రస్థాయిలో కార్మికులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటనేదానిపై ప్రభత్వం నుంచి స్పందన ఉండదు. ప్రజలు ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురుచూస్తూ ఉంటారు. ఆ పని ఎన్నాళ్లకీ పరిష్కారం కాదు. వీధిలైట్ల మరమ్మతులో విద్యుత్‌ కార్మికుడు కరెంటు షాక్‌ తగిలి స్తంభంపై నుంచి జారపిడి మరణిస్తాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోదు. ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు, కార్మికులకు ఎలాంటి సమస్యలూ లేవని అందరినీ సమన్వయం చేసుకుని పరిష్కరించేస్తుంటామనే భ్రమలో ఉంటూ పాలన సాగిస్తుంటారు.’ కమిటీల పేరుతో ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా మొద్దనిద్రలో ఉందనే దృశ్య రూపాలతో కార్మికులు ప్రదర్శించిన నృత్యం ప్రజలను ఆలోచింపజేసింది.

➡️