జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌గా వి.రామచంద్ర రెడ్డి

నియామక ఉత్తర్వులను అందుకుంటున్న వి.రామచంద్రారెడ్డి

        అనంతపురం : అనంతపురం జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌గా నార్పల మండల దగ్గుమర్రి గ్రామానికి చెందిన వి.రామచంద్ర రెడ్డి నియమితులయ్యారు. కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ ఆయనకు శుక్రవారం నాడు నియామక ఉత్తర్వు పత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఉత్తర్వులను అందజేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, రైతుల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలియజేశారు.

➡️