నిజమైన సేవకులు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

నిజమైన సేవకులు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్‌కెయు విసి కె.హుసేన్‌రెడ్డి, అధ్యాపకులు

ప్రజాశక్తి-అనంతపురం

ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు నిజమైన సేవలు అని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ కె.హుసేన్‌రెడ్డి కొనియాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ వన్‌ ఆధ్వర్యంలో ఎస్‌కెయు సమీపంలోని ఆకుతోటపల్లిలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామం పరిసర ప్రాంతాల్లో వారం రోజులపాటు తెలుగు, తులనాత్మక సాహిత్యశాఖ, బిఎడ్‌ కళాశాల, న్యాయశాఖ, వాణిజ్య శాస్త్ర తదితర శాఖల విద్యార్థులు స్వచ్ఛభారత్‌, చెట్లు నాటడం, రోడ్లను మరమ్మతు చేయడం, పక్షులకు ఆహారం, నీటి సౌకర్యం కల్పించడం, ఓటుహక్కుపై అవగాహన ర్యాలీలు, పరిసరాలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో విసి హుసేన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు చేసిన సేవలు అభినందనీయమన్నారు. అలాగే కరోనా వంటి గడ్డుకాలంలో కూడా వీరి సేవలు అనితర సాధ్యమన్నారు. క్రమశిక్షణతో సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.కృష్ణకుమారి మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు నిస్వార్థ సైనికులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డి.మురళీధర్‌రావు, బి.ఎడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.ఆర్‌.సదాశివరెడ్డి, బీ.ఎడ్‌ కళాశాల అధ్యాపకులు అనితమ్మ, రాముడు, రాజేశ్వరి, శకుంతల, సొలమాన్‌రాజు, శివానంద, నారాయణస్వామి, సుధాకర్‌, తెలుగు శాఖ అకడమిక్‌ కన్సల్టెంట్ల్‌ కె.జగదీష్‌, నానీల నాగేంద్ర, బోధన, బోధనేతర సిబ్బంది, తెలుగు, తులనాత్మక సాహిత్య శాఖ, బిఎడ్‌ కళాశాల, న్యాయశాఖ, వాణిజ్య శాస్త్ర తదితర శాఖల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️