పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా ప్రోత్సాహం : కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

     అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకోసం పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించిన 47వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలన్నారు. పారిశ్రామికవాడల్లో పరిశ్రమలకు కేటాయించిన స్థలాల్లో పరిశ్రమలు నేలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలా రాప్తాడులో స్థాపించబడే యూనిట్ల ప్రగతి నివేదికను సమర్పించాలని ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ని ఆదేశించారు. సమావేశంలో జిల్లాలో ఏర్పాటు చేసే పలు పరిశ్రమల యూనిట్లకు ఆమోదం తెలిపారు. ఇక ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై విస్తతంగా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.నాగరాజ రావు, ఎపిఐఐసి జెడ్‌ఎం సోనీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️