బిసిల వెన్ను విరిచిన సిఎం జగన్‌

బిసిల వెన్ను విరిచిన సిఎం జగన్‌

‘బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ కాదు బ్యాక్‌ బోన్‌ క్లాసెస్‌’ పుస్తకాన్ని విడుదల చేస్తున్న బికె.పార్థసారధి

పెనుకొండ : సిఎం జగన్‌ బిసిల వెన్ను విరుస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థ సారథి విమర్శించారు. పట్టణం లోని పార్టీ కార్యాల యంలో శనివారం ఆయన ‘బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ కాదు బ్యాక్‌ బోన్‌ క్లాసెస్‌’ పుస్తకాన్ని పార్టీ నాయ కులు, కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ బిసిల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. బిసిలపై జగన్‌ రెడ్డి, ఆయన సామంతరాజుల పెత్తనం ఏంట ని నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే జగన్‌ బిసిల జపం మొదలుపెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా బిసి సెల్‌ అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య, ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గౌడ్‌, మండల కన్వీనర్‌ సిద్దయ్య, పట్టణ అధ్యక్షులు రవిశంకర్‌, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న వెంకటరాముడు, జిల్లా యాదవ సాధికార కన్వీ నర్‌ కేశవయ్య, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలడుగు చంద్రశేఖర్‌, జిల్లా కార్య నిర్వాహక కార్య దర్శి దేవానరసింహప్ప, జిల్లా అధికారప్రతినిధి రఘువీరాచౌదరి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు లక్ష్మి నారాయణరెడ్డి, రామలింగ, ఫ్యాక్షన్‌ శ్రీనివాస్‌, గుట్టూరు నాగరాజు, పోతిరెడ్డి, హనుమంతనాయక్‌, ఆదిశేషు, చంద్రమౌళి, శేఖర్‌, రాము, కిరణ్‌, సూర్యనారాయణ, శరత్‌, నారాయణ నాయక్‌, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️