15 నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

15 నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

పోస్టర్లను విడుదల చేస్తున్న రైతుసంఘం నాయకులు

తాడిపత్రి రూరల్‌ : కర్నూలులో ఈనెల 15, 16, 17వతేదీల్లో నిర్వహించనున్న ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని ఎపి రైతుసంఘం సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఎపి రైతుసంఘం కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం నాయకులు రాజారామిరెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతులకు వనరులు కల్పించే స్థితిలో రాజకీయ పార్టీలు లేవన్నారు. ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఈనేపథ్యంలో అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి రైతులను ఎలా బయటకు తీసుకురావాలన్న అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతుసంఘం నాయకులు జయశంకర్‌రెడ్డి, శిరీషా, మల్లిక పాల్గొన్నారు.

➡️