90 శాతం సబ్సిడీతో విత్తనకాయలు ఇవ్వాలి : సిపిఎం

90 శాతం సబ్సిడీతో విత్తనకాయలు ఇవ్వాలి : సిపిఎం

ఆత్మకూరులో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-ఆత్మకూరు90శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయలను పంపిణీ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌కు సిపిఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది నుంచి అతివృష్టి, అనావృష్టి వల్ల జిల్లా రైతాంగం పూర్తి అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో అధికంగా మంది రైతులు పంట సాగు చేయాలంటే కష్టసాధ్యమన్నారు. కావున ప్రభుత్వం స్పందించి 90శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాని కోరారు. అలాగే అలసంద, ఆముదం, కంది, పెసలు వంటి విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు రాము, మండల కమిటీ సభ్యులు రామయ్య, ఐద్వామహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు కృష్ణవేణి, కమిటీ సభ్యులు ఉమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️