అవకాశమివ్వండి.. అభివృద్ధి చేస్తా..

ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి

ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపు తా.. అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉరవకొండ మండల పరిధిలో మైలారంపల్లి గ్రామంలో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పేదల జీవితాలను బుగ్గిపాలు చేసిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో కూడా టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఈ రెండు పార్టీలూ బిజెపితో జతకట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. మరోసారి మోసం చేసేందుకు వైసిపితోపాటు బిజెపి, టిడిపి, జనసేన కూటమిగా వస్తూ అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయన్నారు. వాటిని ప్రజలు నమ్మొద్దన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే రైతు రుణమాఫీతో పాటు నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.

➡️