ఒక్క అవకాశమివ్వండి..అభివృద్ధి చేసి చూపుతా..

ఒక్క అవకాశమివ్వండి..అభివృద్ధి చేసి చూపుతా..

ఓటర్లను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. ఒక్క అవకాశం ఇవ్వండి.. గతంలో ఏ నాయకుడూ చేయని అభివృద్ధి చేసి చూపుతా..’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం కూడేరు మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వై.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతు రుణమాఫీ రూ.2 లక్షలు, మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి ప్రతి మహిళకూ రూ.లక్ష, ప్రత్యేక హోదా, రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.400 వేతనం, కేజీ టు పీజీ వరకూ ఉచిత విద్య, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు రూ.4వేలు, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీకి భరోసా వంటి హామీలు అమలు చేయనున్నట్లు తెలిపారు. వీటితోపాటు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తానన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కృష్ణమూర్తి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️