అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

ఎన్నికల ప్రచారం చేస్తున్న శంకర్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

పేదలు, బడుగు బలహీన వర్గాల పక్షపాతినైన తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో రాప్తాడు ప్రజలు చేసి చూపిస్తానని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సాకే శంకర్‌ అన్నారు. శనివారం రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చియ్యూడు, పూలకుంట, కృష్ణంరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి హామీలను వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ పేదల పక్షపాతి పార్టీ అన్నారు. పేదలు బాగుపడాలంటే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం దేశం, రాష్ట్రంలో రావాలన్నారు. రాప్తాడులోనూ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ఆదరించాలని కోరారు. మీ కుటుంబ సభ్యుడినై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

➡️