గుంతకల్లులో విజయం సాధిస్తా : గుమ్మనూరు

గుంతకల్లులో విజయం సాధిస్తా : గుమ్మనూరు

ప్రచారంలో మాట్లాడుతున్న గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి-పామిడి

మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు ఎమ్మెల్యేగా తప్పకుండా విజయం సాధిస్తానని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పామిడి మండలం అనుంపల్లి, ఖాదర్‌పేట, కట్టకిందపల్లి, దిబ్బసానిపల్లి, రామగిరి ఎగువ తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయరామ్‌ మాట్లాడుతూ ప్రజలందరి దీవెనలతో కచ్చితంగా విజయం సాధిస్తానన్నారు. మీరందరూ తప్పకుండా సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి, వేయించి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్‌, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️