పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోండి

పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోండి

అధికారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

ప్రజాశక్తి-వజ్రకరూరు

ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉరవకొండ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సూచించారు. ఆదివారం ఉరవకొండలోని కరిబసవస్వామి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం 12 అప్లికేషన్లను పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 1వతేదీలోపు సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఏవిధంగా ఉపయోగించాలనే విషయాలపై కేతన్‌గార్గ్‌ శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల నమోదు అధికారిణి శిరీషా, ఉరవకొండ, కూడేరు తహశీల్దార్లు శ్రీనివాసులు, రత్నరాధిక, తదితరులు పాల్గొన్నారు.

➡️