ఆదరించండి..అభివృద్ధి చేస్తా..: గుమ్మనూరు

ఆదరించండి..అభివృద్ధి చేస్తా..: గుమ్మనూరు

ప్రజలకు నమస్కరిస్తున్న గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి-గుత్తి

ఒక్కసారి ఆదరి ంచండి.. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలతోపాటు గుత్తి, పామిడి పట్టణాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌ హామీ ఇచ్చారు. మంగళవారం గుత్తి ఆర్‌ఎస్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా పత్తికొండ రోడ్డు కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనలో సమస్యలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఏ గ్రామంలో చూసినా తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు విపరీతంగా ఉన్నాయన్నారు. పరిష్కరించాల్సిన పాలకులు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఈనేపథ్యంలో టిడిపితోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. ముఖ్యంగా చంద్రబాబుతోనే రాష్ట్రంలో సూపరిపాలన కొనసాగుతుందన్నారు. కావున ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించా రు. అనంతరం ఆర్యవైశ్యులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. తర్వాత బసినేపల్లి, అనగానిదొడ్డి, మాముడూరు, తురకపల్లి, అబ్బేదొడ్డి, పి.ఎర్రగుడి, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు జి.వెంకటశివుడు యాదవ్‌, టిడిపి నాయకులు గుమ్మనూరు నారాయణ, కెసి.హరి, చిన్నరెడ్డియాదవ్‌, ఎంకె.చౌదరి, ఎన్‌.కేశవనాయుడు, దిల్కా శీనా, పి.రవితేజ, పి.నారాయణస్వామి, బర్దివలి, జక్కలచెరువు గోవిందు, ప్రతాప్‌, కోనంకి కృష్ణ, శ్రీనివాస్‌చౌదరి, శ్రీకాంత్‌చౌదరి, బోర్‌వెల్‌ నాగరాజు, డాక్టర్‌ వి.నాగేంద్ర, న్యాయవాది సోము, కరిడికొండ సూరి, సి.బాలరాజు, ఎన్‌.రమేష్‌యాదవ్‌, కొనకొండ్ల సూరి, టౌన్‌ బ్యాంకు అధ్యక్షులు అబ్దుల్‌ జిలాన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️