ప్రమాదపు అంచున జ్యోతిరావు పూలే విద్యార్థులు

Feb 10,2024 12:44 #Anantapuram District
phule students are in danger

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రమాదపు అంచున ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే పాఠశాల ప్రక్కనే ప్రమాదకరస్థాయిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. విద్యార్థులు హాస్టల్ లోపలికి వెళ్ళేటువంటి ప్రధాన గేటు దగ్గర ప్రమాదకర స్థాయిలో చేతులకు అందే ఎత్తులోనే ట్రాన్స్ఫార్మర్ ఉన్నది పిల్లలు లోపలికి బయటికి వచ్చేటప్పుడు ఏ కొంచెం ఏమరపాటు ఉన్న భారీ ప్రమాదం జరిగే స్థాయిలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. స్థానిక సిపిఐ నాయకులు మండల కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ పిల్లలు తిరిగే ప్రదేశంలో ట్రాన్స్ఫార్మర్ ను తొలిగించాలని సిపిఐ నాయకులు గంగాధర్ కోరారు. శనివారం మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే హాస్టల్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ను ఆయన పరిశీలించారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు నార్పల ఏఈ స్పందించి వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తరలించాలని లేని పక్షాన ఏదైనా ప్రమాదం జరిగితే విద్యుత్ అధికారులే బాధ్యత వహించాలని గంగాధర్ చెప్పడం జరిగింది. ఆయనతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య నారాయణప్ప, సిపిఐ సీనియర్ నాయకులు నాగరాజు, సుధాకర్, శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

➡️