పక్కాగా ఎన్నికల నియమావళి అమలు

పక్కాగా ఎన్నికల నియమావళి అమలు

మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి గ్రంధి వెంకటేష్‌

అనంతపురం కలెక్టరేట్‌ : సాధారణ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న బృందాలన్నీ సమిష్టిగా పని చేసి ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి గ్రంధి వెంకటేష్‌ అన్నారు. శనివారం అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం( 153) ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయా టీమ్‌లతో డ్వామా హాల్‌ సమావేశం నిర్వహించారు. అకౌంటింగ్‌, వివిటి, విఎస్‌టి, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టి, ఎంఎంయు, కంట్రోల్‌ రూం, సింగిల్‌విండో పర్మిషన్‌ యూనిట్‌, కంట్రోల్‌ రూం ఇన్‌చార్జిలతో వారి విధుల నిర్వహణపై సమీక్షించారు. ఆయా టీంలు ఇప్పటి వరకూ నిర్వహించిన విధులు, అనుసరిస్తున్న రిజిస్టర్లపై అడిగి తెలుసుకున్నారు. ఆయా టీంలు రిజిస్టర్లు పొందుపరచి పక్కాగా రిపోర్టులు సమర్పించాలన్నారు. ప్రతి టీం వారి విధులు పక్కాగా పకడ్బందీ జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. రాజకయ పార్టీలు వారు అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని, పాంప్లెట్‌లు, బహుమతులు పంచడం, వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ఓ శివరామిరెడ్డి, పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️