పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Jun 1,2024 16:45 #Anantapuram District

 ఎస్సై రాజశేఖర్ రెడ్డి 

ప్రజాశక్తి-నార్పల :  మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉంటుందని ఈ సందర్భంగా మండలంలో ఎవరైనా గొడవలకు దిగడంకానీ ఒకరిని ఒకరు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం బాణాసంచాలు కాల్చడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు అని జయాపజయాలు మన చేతుల్లో ఉండవని ప్రజాతీర్పును ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ సమన్వయంతో వ్యవహరించాలి అని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నుండే మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వస్తుంది అని ఎక్కడ కూడా గుంపులుగా జనాలు గుమికూడారాదని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

 

➡️