భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన వివేకానందుడు

Jan 12,2024 15:17 #Anantapuram District
swamy vivekananda jayanti in atp

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన ఘనత వివేకానందుడిదని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో శుక్రవారం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్లు అని స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అతి చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడు స్వామి వివేకానంద స్వామిజీ అని స్వామి వివేకానందుని ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని సూచించారు. తక్కువ కాలమే జీవించినా నేటికి స్వామి వివేకానంద ను గుర్తించుకుంటున్నారు అంటే ఆయన చేసిన భోదనలే కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమములో అదనపు కమిషనర్ రమణారెడ్డి , కార్యదర్శి సంగం శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ వాసంతి కార్పొరేటర్లు చంద్ర మోహన్ రెడ్డి, సైపుల్ల కార్యదర్శి సంగం శ్రీనివాసులు, ఈఈ సూర్యనారాయణ, సుధామణి, డిఈ ద్రాక్షాయణి,ఆర్ఐ లు వేణుగోపాల్,  ఎస్.ఆర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️