పళ్లేలు మోగిస్తూ అంగన్వాడీల నిరసన

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) :రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసిడిఎస్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వెళుతూ పళ్లేలు మోగించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శివరంజని, విజయమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️