విజిల్స్‌ ఊదుతూ అంగన్వాడీల నిరసన

Dec 24,2023 15:13 #Anganwadi strike, #Kakinada

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 13 వ రోజుకు చేరుకుంది.పెద్దాపురం అంగన్వాడీ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలు విజిల్స్‌ ఊదుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌, ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ సమ్మె శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి దాడి బేబీ, ఎస్తేరు రాణి, నాగమణి, అమల, టీఎల్‌ పద్మావతి, కాలే దేవి, జే.కుమారి, జ్యోతి, లోవ తల్లి, వసంత కుమారి, వెంకటలక్ష్మి, నాగమణి, సావిత్రి, రత్నం, లక్ష్మి, లోవ కుమారి, మహాలక్ష్మి, మంగాలక్ష్మి, రజని, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

➡️