29వ రోజుకు అంగన్వాడీల సమ్మె.. మెయిన్‌ రోడ్డుపై భైఠాయింపు

Jan 9,2024 14:30 #Anganwadi strike, #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం మెయిన్‌ రోడ్‌ లో 29 రోజులు సందర్భంగా 29వ రోజు అనుకరిస్తూ అంకెలలో కూర్చుని అంగన్వాడీ వర్కర్లు నిరసన తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలని మెయిన్‌ రోడ్డుపై బైఠాయించి అక్కడే నిరసన తెలిపారు. మెయిన్‌ రోడ్డుపై అంగన్వాడి వర్కర్లు బయట వేయించడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎం దుర్గ, నూకల బలరాంలు మాట్లాడుతూ 29 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అంగన్వాడి వర్కర్లపై ఎస్మ ప్రయోగించడం జీవో రెండును ఉపయోగించడం వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్గొనవద్దని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రామచంద్రపురం కే గంగవరం మండలం నుండి సుమారు 400 మంది అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ఈ శ్రమలో పాల్గొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని జీతాలు పెంచాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️