పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి-అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌

May 9,2024 21:56

ప్రజాశక్తి -రాయచోటి ఈనెల 13న నిర్వహించబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలింగ్‌ నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని 85 శాతం పైగా పోలింగ్‌ నిర్వహించేందుకు ఓటర్లు ముందుకు రావాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ హోమ్‌ ఓటింగ్‌ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని వివరించారు. ఇవిఎం స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం సిసిటివి పర్యవేక్షణ విద్యుత్‌ సరఫరా ఉండేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు. ఈనెల 10 నుంచి 72 గంటలకు ప్రోటోకాల్‌ ప్రారంభమవుతుందని, అన్ని చెక్‌పోస్టులు సందర్శించి డబ్బు, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాం మోపుతామన్నారు. రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించే కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి పక్కగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్‌ సరళి సిసి టివి కెమెరా పర్యవేక్షణలో సాగుతుందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మే 11న సాయంత్రం 6 గంటలకు ప్రచార కార్యక్రమాలు పూర్తిగా నిలిపేయాలన్నారు. సాయంత్రం 6 తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించరాదని సూచించారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. ఆరు గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. వివిధ పార్టీల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. జిల్లాలో 80 శాతం పైగా పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నామని, ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుని ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఓటు వేసి అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పర్యవేక్షణలో సాగుతుందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మే 11న సాయంత్రం 6 గంటలకు ప్రచార కార్యక్రమాలు పూర్తిగా నిలిపేయాలన్నారు. సాయంత్రం 6 తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించరాదని సూచించారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. ఆరు గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. వివిధ పార్టీల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. జిల్లాలో 80 శాతం పైగా పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నామని, ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుని ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఓటు వేసి అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.

➡️