కళ్ళు మూసుకొని అంగన్వాడీల నిరసన

Jan 19,2024 14:09 #Annamayya district
anganwadi workers strike 39th day annam

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా 39వ రోజు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కళ్ళు మూసుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించి తమ డిమాండ్లు నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు ఈశ్వరమ్మ, కార్యకర్తలు విజయ, అమరావతి, శివరంజని, గౌసియా, విజయలక్ష్మి, శివ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

➡️