బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ

Jun 20,2024 15:27 #Annamayya district, #rayachoti

ప్రజాశక్తి – నందలూరు : మండల ప్రజల అవసరార్థం, మరణించిన వారి కోసం బాడీ ఫ్రీజర్ ను మండెం సీతారామయ్య గౌడ్ తన సొంత నిధులతో గురువారం మానవత సేవా సంస్థ, లయన్స్ అండ్ వాకర్స్ క్లబ్స్ సభ్యులకు బాడీ ఫ్రీజర్ బాక్స్ ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మండెం సీతారామయ్య గౌడ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లయన్ మన్నెం రామమోహన్ (ఎస్సై ఆఫ్ స్పెషల్ పోలీస్) మాట్లాడుతూ దాత సీతారామయ్య గౌడ్ ను అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత మంది ముందుకు వచ్చి పేద ప్రజల అవసరాలు తీర్చడానికి దోహదపడే కార్యక్రమాలను చేయాలని ఆకాంక్షించారు. మరణించిన తమ కుటుంబ సభ్యుల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, మోడపోతుల రాము, ఆనాల మధు యాదవ్, గుణ యాదవ్, రామచంద్రయ్య, గంధం గంగాధర్, కానకుర్తి వెంకటయ్య, శ్యామనబోయిన గురు ప్రసాద్, కొత్తపల్లి రాజా చారి, రామ్మోహన్ రెడ్డి, పుత్తా వెంకటేష్, గుండు సురేష్, ధర్మ తేజ, మట్టి బాబు, చామంచి పెంచలయ్య, సోమిశెట్టి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

➡️