ఐరన్ పోలిక్ యాసిడ్ సిరప్ పంపిణీ 

Mar 22,2024 15:30 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: ఐరన్ పోలిక్ యాసిడ్ సిరప్ ను పంపిణీ చేసినట్లు ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎంవీ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఎం బి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఐరన్ పోలిక్ యాసిడ్ సిరప్స్ పంపిణీ ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఉప కేంద్రాలకు సప్లై కొరకు ఉపకేంద్రమునకు 50 బాటిల్స్ చొప్పున పంపిణీ చేయడం జరిగినది. ఒక బాటల్ 60 మిల్లి లీటర్లు ఉంటుందని ఈ ఐఎఫ్ఎ సిరప్ పిల్లలకు రక్తహీనత నుండి కాపాడుతుంది.ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ప్రతి బుధ శనివారాలలో రెగ్యులర్ మరియు అవుట్ రిచ్ సెషన్లలో ఈ ఐ.ఎఫ్.ఏ. టానిక్ నూ పిల్లర్ ద్వారా తప్పక ప్రతి బిడ్డకు వన్ ఎం.ఎల్. చొప్పున వెయ్యాలని బిడ్డకు ఆరు మాసాల నుండి ఐదు సంవత్సరాల వరకు వెయ్యాలని ఐరన్ సిరప్ ను పిల్లలకు వేసిన వెంటనే యం. సి. పి కార్డులో నమోదు చేయాలని ప్రతి బిడ్డకు గ్రోత్ చార్ట్ తప్పనిసరిగాకార్డు లో గుర్తించాలని పిల్లలకు మైల్డ్. మాడ్రేట్. సివియర్.ఈ మూడు రకాలు గుర్తించాలని వైద్యాధికారి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఓ జి.జయరామయ్య. స్టాఫ్ నర్స్ జై భారతమ్మ. పీ.హెచ్.న్. కే.సుబ్బరత్న. సూపర్వైజర్ బి రెడ్డమ్మ. ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️