సీట్ల కోసం.. ఎన్ని ఫీట్లో…!!

Apr 4,2024 13:22 #Annamayya district

ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదే…
తగిన మూల్యం తప్పదంటున్న ప్రయాణికులు

ప్రజాశక్తి-పీలేరు : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే ప్యాసింజర్లకు బస్సుల్లో సీట్ల కోసం ఫీట్లు తప్పడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా జనాన్ని సమీకరించడం కోసం గత మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం పీలేరు నుంచి వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేయాలనుకున్న ప్యాసింజర్లు గంటల కొద్దీ బస్టాండులో నిరీక్షించక తప్పడం లేదు. కనీసం కూర్చోవడానికి కూడా తగినంత స్థలం లేక నిలబడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తాము వెళ్లాలనుకున్న మార్గంలో నడిచే బస్సులు ఎప్పటికో రావడం జరుగుతోంది. బస్టాండుకు వచ్చిన బస్సులో సీట్లు సొంతం చేసుకోవడం కోసం వారు నానా యాతనలు9 పడాల్సి వస్తోందని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గురువారం శుభకార్యాలకు మంచి రోజు కావడంతో వివాహాలు, గృహ ప్రవేశాలకు వచ్చేవారు, తిరిగి వారి గమ్యాలకు వెళ్లేవారు. ఇతర పనులపై వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు సమయానికి వెళ్లలేక, తిరిగి రాలేక తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఈ పాపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనిని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోకóó తప్పదని కొందరు ప్రయాణికులు తమ బాధను వ్యక్తం చేశారు.

➡️