ఘనంగా జగ్జీవన్ జయంతి వేడుకలు

Apr 5,2024 13:00 #Annamayya district

ప్రజాశక్తి-బి.కొత్తకోట : భారతదేశానికి మొదటి దళిత ఉప ప్రధాని మంత్రి జగ్జీవన్ 114వ జయంతి సందర్భంగా బి.కొత్తకోట భారతీయ అంబేద్కర్ సేన బాస్ కార్యాలయంలో బాస్ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బాస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ దళితుల కోసం 1930 నుంచి స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహంలో దళిత పీడిత వర్గాల కోసం పోరాటాలు చేసిన స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కార్యదర్శి సింగన్న మరియు తాలూక ఇంచార్జ్ కోగర్ మాధవ గోకర వెంకటేష్ సొట్ట గంగాద్రి చెన్నాగారి పల్లె నవీన్కా శ్రీనివాసులు శంకర సుబ్బారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

➡️