నారాయణ స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Jun 27,2024 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే తరగతులు ప్రారంభించిన నారాయణ స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఆ సంఘం నాయకులు జిల్లా విద్యా శాఖ ఎడి గౌరీ శంకర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రదీప్‌ నగర్‌ సమీపంలోని నోబుల్‌ నగర్‌లో నిర్మాణం జరుగుతున్న నారాయణ సిబిఎస్‌ఇ స్కూల్‌ను ప్రారంభించడం అన్యాయమన్నారు. భవనాలు నిర్మాణంలోనూ అండగా పాఠశాల ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. జిల్లా అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. వెంటనే నారాయణ స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ పిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సంఘం నాయకులు యుఎస్‌ రవికుమార్‌, బి.రమణ, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️