లయన్స్ క్లబ్ ఉత్తమ జిల్లా చైర్మన్ గా పోతుగుంట

Apr 8,2024 12:41 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : లయన్స్ క్లబ్ ఉత్తమ జిల్లా చైర్మన్ గా పోతుగుంట రమేష్ నాయుడు ఎంపికయ్యారు. ఆదివారం ప్రొద్దుటూరులో లయన్స్ రీజియన్ క్లబ్ చైర్మన్ లయన్ చంద్రప్రకాష్ రావు ఆధ్వర్యంలో జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజంపేటకు చెందిన లయన్స్ క్లబ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఉత్తమ జిల్లా చైర్మన్గా అవార్డును అందుకున్నారు. అలాగే ఉత్తమ రీజియన్ చైర్మన్ గా షేక్ అబ్దుల్లా, ఉత్తమ అధ్యక్షులుగా వై.సుబ్రహ్మణ్యం రాజు అవార్డులు అందుకున్నారని పోతుగుంట రమేష్ నాయుడు తెలియజేశారు. లయన్స్ క్లబ్ సేవ చేయడంలో సదా ముందు వరుసలో ఉంటుందని, అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.

➡️