ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది 

Mar 31,2024 14:03 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని వక్తలు కొనియాడారు. మండలంలోని బాటవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయులుగా గంగాద్రి నాయుడు విధులు లేదు నిర్వహిస్తూ మార్చి 31వ తేదీకి ఉపాధ్యాయ వృత్తి పూర్తి కావడంతో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని ఉత్తమమైనదని ఇతరులకు ఆదర్శప్రాయమైన గుర్తి అని తెలిపారు. ఉపాధ్యాయులు తమ మేధాశక్తిని విద్యార్థులకు బోధించి విద్యార్థులను క్రమశిక్షణ కలిగి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఉపాధ్యాయ దోహదపడతారని తెలియజేశారు.ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఉద్యోగంలో చేరిన రోజే రిటైర్మెంట్ తేదీ కూడా ఖరారు. అవుతుందని దానికి చింతించవలసిన అవసరం లేదని పలువురు హితోపదేశం చేశారు. అనంతరం విశ్రాంతి పొందిన గంగాద్రి నాయుడు దంపతులను పూలమాలలు దుశ్యాలవాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఎంఈఓ ఆదినారాయణ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సరస్వతి, శ్రీనివాసులు రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు అక్రమ భాష, నాగరాజ, ఎంపీపీ శ్రీదేవి రవికుమార్, మండలంలోని అన్ని ఉన్నత ,ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️