మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మృతి

May 18,2024 14:43 #Annamayya district

నివాళులర్పించిన టీడీపీ జాతీయనేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దంపతులు 
ప్రజాశక్తి-కలికిరి: కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ టిడిపి సీనియర్ నాయకులు రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గత వారం వడదెబ్బకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 9 గంటలకు మృతి చెందినట్లు ఆయన కుమారుడు యోగేష్ రెడ్డి తెలిపారు. గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా అత్యధిక మెజార్టీతో గెలిచి కలికిరి పట్టణం అభివృద్ధికి విశేష కృషి చేశాడు. అనంతరం పార్టీ అంతర్గత విభేదాలుతో వైసిపి పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఈ నెల 5న వడదెబ్బకు గురై చెన్నై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆరోగ్యం సహకరించక శుక్రవారం రాత్రి 9గంటలకు తుది శ్వాస విడిచారు.
సమాచారం తెలుసుకున్న నల్లారి కుటుంబ సభ్యులు షాక్ కు గురై ప్రతాప్ రెడ్డి ఇక లేరన్న వార్త విని జీర్ణించుకులేక పోయారు. అనంతరం ఆయన పార్టీ ఉదయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తమ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఎలాంటి అవసరం వచ్చిన వారిని తెలుగుదేశం పార్టీ, నల్లారి కుటుంబం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రతాప్ రెడ్డి అందించిన సేవలు,కలికిరి పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి మరువ లేనివని, మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరం అంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొనియాడారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు సతీష్ రెడ్డి పలువురు తెలుగుదేశం వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

➡️