ముగ్ధ షాపింగ్ మాల్ ఎదురుగా భిక్షాటన

Dec 2,2023 16:39 #Visakha
arrest mugdha shopping workers

ప్రజాశక్తి-విశాఖ : ముగ్ధ షాపింగ్ మాల్ కార్మికుడు మురళీకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ మాల్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. వెంటనే పోలీసులు వచ్చి భిక్షాటన చేయకూడదు అని దౌర్జన్యంగా సిఐటియు నాయకులు సుబ్బారావుతో పాటు మురళీకృష్ణ భార్యను, పిల్లలను, అతని అత్తని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నంకు చెందిన మురళీకృష్ణను కాంచీపురం ముగ్ధ షోరూంకు క్యాషియరుగా అపాయింట్ చేసి Rs.50,000/- జీతం కుటుంబానికి వసతి ఇస్తామని చెప్పి తీసుకువెళ్లారు. కానీ అక్కడ Rs.19,800/- ఇచ్చి మిగతా వర్కర్స్ తో కలిసి ఫ్లాట్ ఇచ్చినందున కుటుంబానికి తీసుకు వెళ్ళలేకపోయారు అంతేకాకుండా పని భారం పనివత్తిడి విపరీతంగా ఉందని భార్యతో చెప్పి బాధ పడేవారు. అయితే మురళీకృష్ణగారు అశ్వత్థతో ఉన్నారని భార్యకు చెప్పి మరో గంట తర్వాత చనిపోయారు అని చెప్పారు. కానీ శవపరీక్షకు భార్యను రావద్దు అని చెప్పి శవాన్ని పంపించారు. 7 మసాలా వరకు తిప్పించుకొని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని యెందుకంటే అధికారులు మా చేతుల్లో ఉన్నారని గేలి చేస్తున్నారు. ఈ విషయమై పోలీసు కమిషనర్ గారికి ఫిర్యాదుచేస్తే వెంటనే 2 టౌన్ CI గారికి లైన్ లోకి తీసుకుని కేసు నమోదు చేయమని ఆదేశించారు కానీ 2 టౌన్ సిఐ కేసు నమోదు చేయలేదు. పైగా సిఐటియుతో కాదని చెప్పారు. అందుకే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కానీ పోలీసులు యాజమాన్యంను వత్తాసు పలుకుతూ జలాలను బెదిరిస్తూ వీరిని అరెస్టు చేశారు.

➡️