మేరీ మాత ఆలయాన్ని ప్రారంభించిన హనిమిరెడ్డి

Dec 25,2023 23:51

ప్రజాశక్తి- సంతమాగులూరు
క్రీస్తు ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, శాంతి, సామరస్యం కోసం ఏసుప్రభు బోధనలు భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలని వైసీపీ ఇన్చార్జి పానెం హనిమిరెడ్డి కోరారు. మండలంలోని ఏల్చూరు గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులు నూతనంగా నిర్మించిన మేరీమాత దేవాలయాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలోని వివిధ చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రీస్తు సేవకులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట సంతమాగులూరు ఎఎంసి వైస్ చైర్మన్ ముసలారెడ్డి, సర్పంచి మందా సూరిబాబు, వెంకటేశ్వరరెడ్డి, బి శేషిరెడ్డి పాల్గొన్నారు.

➡️