ఘనంగా ప్రజా సంకల్ప యాత్ర

Jan 10,2024 00:30

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
ఎన్నికలకు ముందు సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష హోదాలో చేసిన ప్రజాసంకల్పయాత్ర నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా స్థానిక వైసిపి కార్యాలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి కేక్ కట్ చేశారు. రాష్ట్రంలో విప్లవత్మకమైన రాజకీయ మార్పులు తెచ్చిన ప్రజాసంకల్పయాత్ర తెలుగు వారి మదిలో ఇప్పటికీ గుర్తుండే ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేసి వైసిపిని గెలిపించాలని కోరారు.

➡️