దివ్యాంగుల ఓటు హక్కుపై అవగాహన

Apr 19,2024 00:42 ##elections #voter

ప్రజాశక్తి – అద్దంకి
సింగరకొండ రోడ్డులోని చైతన్య మహిళా మండలి బదిరుల ఆశ్రమ పాఠశాల ఆవరణంలో దివ్యాంగులకు ఓటు హక్కు అవగాహన సదస్సును ఎన్నికల విభాగం నోడల్ ఆఫీసర్ వై పిచ్చిరెడ్డి, జిల్లా దివ్యాంగులు విభాగం నోడల్ ఆఫీసర్ ఆర్ గుణశీల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. స్వీప్ నోడల్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని, సాక్ష్యం యాప్ ఉపయోగించుకొని దివ్యాంగులు ప్రతి ఒక్కరు ఓటు వేసేట్లు ముందుకు రావాలని హాజరైన దివ్యాంగులను ఉద్దేశించి చెప్పారు. దివ్యాంగుల విభాగం నోడల్ అధికారి ఆర్ గుణశీల మాట్లాడుతూ దివ్యాంగులు ఓటు వేయటానికి సాక్ష్యం యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకొని, తద్వారా పోలింగ్ స్టేషన్‌లో సులువుగా ఓటు వేయవచ్చని చెపపారు. దివ్యాంగులకు వీల్ చైర్, రవాణా సదుపాయం వంటివి కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల విభాగం స్వచ్ఛంద సంస్థల సభ్యులు పోనూరి ఆరోగ్యం, వెంకన్నబాబు, బదులు పాఠశాల ప్రిన్సిపాల్ సురేంద్రబాబు, స్థానిక నోడల్ ఆఫీసర్స్ అద్దంకి జూనియర్ కాలేజీలోని పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు.

➡️