రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన

Feb 17,2024 00:08

ప్రజాశక్తి – రేపల్లె
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని డిఎస్పి మురళీకృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు స్థానిక రామశాస్త్రి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. రహదారుల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించ వచ్చని అన్నారు. ఆటోలు ఓవర్ లోడింగు చేయవద్దని సూచించారు. అతివేగం ప్రమాదాలకు కారణమని అన్నారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు తీసుకోవడం నేరమన్నారు. మైనర్ పిల్లలకు తమ వాహనాలు ఇవ్వటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. త్రిబుల్ రైడింగ్ చట్టరీత్యా నేరం అన్నారు. త్రిబుల్ రైడింగ్‌ చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లైసెన్స్‌ లేనివారిని డ్రైవర్లుగా స్కూలు వ్యాన్లకు నియమించవద్దని చెప్పారు. అవగాహనతో వాహనాలు నడపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారిణి ప్రసన్నకుమారి, రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️