బాధితులకు నిత్యావసరాల పంపిణీ

Dec 7,2023 23:27

ప్రజాశక్తి – నగరం
తుఫానుతో నష్టపోయిన పేదలకు ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య నిత్యావసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. మండలంలోని ఈదుపల్లి గ్రామ ఎస్టీ కాలనీలో సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బియ్యం పంపిణీ చేశారు. తుఫాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక్కొక్క కుటుంబానికి 25కేజీల బియ్యం, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు, కేజీ బంగాళ దుంపలు, కేజీ ఉల్లిపాయలు పంపిణీ చేశారు. మండలంలో 249కుటుంబాలకు పంపిణీ చేసినట్లు తహశీల్దారు ఎం ప్రమీల తెలిపారు. కార్యక్రమంలో ఈదుపల్లి సర్పంచ్ చింతల పవన్ కుమార్, మీసాలవారిపాలెం సర్పంచ్ చింతల సుబ్బారావు పాల్గొన్నారు.

➡️