ట్రై సైకిల్, తోపుడు బండ్లు పంపిణీ

ప్రజాశక్తి – కర్లపలెం
మండలంలోని పేరలి గ్రామంలో డాక్టర్ పేరలి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిరుపేదలకు ట్రై సైకిల్, తోపుడు బండ్లు ఎంఎల్‌ఎ వేగేశన నరేంధ్రవర్మ చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నరేంధ్రవర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిజాయతిగా పనిచేసినప్పుడే గెలుపు మన సొంతం అవుతుందని అన్నారు. ఈ గెలుపు ప్రతి ఒక్కరిదని అన్నారు. ఈ అధికారం మీరు ఇచ్చినదేనని, తానెప్పుడు సేవకుడిలా పనిచేస్తానని అన్నారు. ప్యార్లి గ్రామానికి చెందిన దొబ్బకూటి సోవమ్మ, దోమతోటి సామ్రాజ్యంకు ట్రై సైకిల్, తోపుడు బండి అందజేశారు. బహుకరించిన డాక్టర్ పేరలి బాలకృష్ణమూర్తిని అభినందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️